January 23, 2020

చంద్రబాబు నాయుడూ…. కబడ్ధార్ ….. అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్నింగ్ …

Clock Of Nellore ( Assembly ) – అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చంద్రబాబునాయుడూ… కబడ్ధార్ …. చంద్రబాబునాయుడూ… కబడ్ధార్ అంటూ వేలెత్తి వార్నింగ్ ఇచ్చారు. 45 ఏళ్ల వయస్సు గల మహిళలకు పెన్షన్ గురించి చర్చ జరుగుతుండగా టిడిపి ఎమ్మెల్యేలు దానిపై మాట్లాడారు. ఎన్నికల్లో పెన్షన్ పై హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదంటూ ఇదే మడమతిప్పని వంశం అంటూ టిడిపి సభ్యులు అరిచారు. దీంతో స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చంద్రబాబునాయుడును ఉద్దేశించి కబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ సభ్యులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఆరోపణలు చేస్తున్నారని అది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో ప్రతి పక్షానికి అనేక అవకాశాలు ముఖ్యమంత్రి కల్పించారని, గతంలో ప్రతి పక్షంలో ఉన్న మాకు ఎంత వేడుకున్నా మైకు ఇవ్వలేదని గుర్తు చేశారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేత జగన్ కు మాట్లాడే అవకాశమే ఇచ్చే వారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలంటే అధ్యక్షా మైకు… అధ్యక్షా మైకు… అంటూ బ్రతిమాలుకోవాల్సి వచ్చిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా…. చంద్రబాబునాయుడూ… కబడ్ధార్ …. చంద్రబాబునాయుడూ… కబడ్ధార్ అంటూ కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!