November 19, 2019

నెల్లూరులో శాంతి కమిటి – ముస్లిం మతపెద్దలు, హింధూ సంఘాలతో చర్చించిన ఆర్డీఓ

Clock Of Nellore ( Nellore ) – అన్నీ మతాల వారు శాంతి, సద్భావం, ఐకమత్యంతో కలిసి మెలసి ఉండాలని నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ పిలుపునిచ్చారు. అయోధ్య కేసు తీర్పు నేపద్యంలో నెల్లూరు నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆయన ముస్లిం మతపెద్దలు, హింధూ సంఘాల ప్రతినిధులతో ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి కూడా పాల్గొన్నారు. హింధూ, ముస్లిం ప్రతినిధులతో శాంతి కమిటిని ఏర్పాటు చేశారు. అయోధ్య తీర్పు నేపద్యంలో నగరంలో ఎలాంటి అల్లర్లు ఉండకూడదని సూచించారు. అలాగే బాణా సంచా కాల్చడం, డప్పులు వాయించడం కూడా నిషేదమన్నారు. ఈనెల 11వ తేదీ వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని దానికి అందరూ సహకరించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని, అందరం సామరస్యంగా ఉంటామని ముస్లిం మత పెద్దలు ఆర్డీఓకు వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!