November 21, 2019

నెల్లూరులో పోలీస్ వాలంటీర్స్ సర్టిఫికేట్స్ పరిశీలన – 501 మంది ఎంపిక

Clock Of Nellore ( Nellore ) –

నెల్లూరు జిల్లాలో గ్రామ మరియు వార్డు స్త్రీ శిశు సంక్షేమ అసిస్టెంట్ మరియు మహిళా పోలీసు పరీక్షలో ఊతీర్ణులైన 501 మంది అభ్యర్ధులను రెండవ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు జిల్లా యస్.పి. ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం నుండి నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయమునకు పిలవడం జరిగింది. ఇందులో భాగంగా 262 మంది అభ్యర్దులు వారి వారి ఒరిజినల్ సర్టిఫికేట్ లతో వెరిఫికేషన్ కొరకు హాజరు అయినారు.

జిల్లా యస్.పి అభ్యర్ధులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సజావుగా నిర్వహించేందుకు డి.పి.ఒ. ఇంచార్జీ డి.యస్.పి. లక్ష్మి నారాయణకు తగిన సూచనలు సలహాలు అందించిన క్రమంలో, అభర్ధులకు వెరిఫికేషన్ సులభతరంగా నిర్వహించేందుకు పోలీసు కార్యాలయ సిబ్బందిని టీమ్ లుగా విభజించి మొత్తం 6 కౌంటర్ లుగా ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్ధులు సర్టిఫికేట్ లు ఏ క్రమంలో కౌంటర్ లలో ఎలా సబ్మిట్ చేయాలి తెలపడం కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఒక్కో కౌంటర్ లో ముగ్గురు సిబ్బందితో పాటు రెండు కౌంటర్ లకు కలిపి ఒక డి.యస్.పి. స్థాయి అధికారిని నియమించి వెరిఫికేషన్ కోసం వచ్చిన అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డి.పి.ఒ. ఇంచార్జీ డి.యస్.పి. లక్ష్మి నారాయణ, మహిళా పి.యస్.డి.యస్.పి. శ్రీధర్, హోం గార్డ్ డి.యస్.పి. శ్రీనివాస రావు, జిల్లా పోలీసు కార్యాలయ ఏ.ఓ. యం. విజయ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ లు చంద్రమౌళి, రామనారాయణ రెడ్డి, లక్ష్మి గీత మరియు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!