November 16, 2019

ఎస్.కే. బాషాకు ఘన నివాళి – పెళ్లైన వారానికే యుద్ధ భూమిలో ప్రాణాలు అర్పించిన సింహపురి జవాన్

Clock Of Nellore ( Nellore ) – వివాహం జరిగిన వారానికే ఉన్నతాధికారుల నుండి పిలుపు. విధుల్లోకి వెళ్లిన గంటల వ్యవధిలోనే టెర్రరిస్టులతో జరిగిన వీరోచిన పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించి అమర వీరునిగా నిలిచిన సింహపురి వాసి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పించారు నెల్లూరు పోలీసులు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నెల్లూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. నెల్లూరుకు చెందిన ఎస్.కే. మస్తాన్ బాషా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( BSF )లో పనిచేసేవారు. 1997 నవంబర్ 7వ తేదీనా త్రిపుర రాష్ట్రంలోని రిషియాబారి ప్రాంతంలోకి ప్రవేశించిన టెర్రరిస్టులను అంతమొందించే క్రమంలో జరిగిన కాల్పుల్లో మస్తాన్ బాషా అశువురు బాసారు. అమరుడయ్యే తేదీకి ఆయనకు వివాహం జరిగి కేవలం 7 రోజులు మాత్రమే. మంగళవారం నెల్లూరు నగర డిఎస్పీ శ్రనివాసులురెడ్డి, ఏఐర్ డిఎస్పీ రవీందర్ రెడ్డి, BSF అధికారి భాస్కర్ రావు ఆయన విధ్యనభ్యసించిన మూలాపేటలోని ఈఎస్ఆర్ఎమ్ స్కూల్ లో సంస్మరణ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడే ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ బాషా కుటుంబసభ్యులు, స్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి తన ముద్దు బిడ్డను త్యాగం చేసిన వీర జవాన్ తల్లి ఖాసింబీ, పెళ్లైన వారానికే భర్తను యుద్ధ భూమికి పంపిన భార్య రహీజా ధన్యులని కొనియాడారు. దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారంటే భారత సరిహద్దుల్లో విపరీత పరిస్థితుల్లో నిరంతరం శ్రమిస్తూ రక్షణ దళాలు చేస్తున్న సేవలే కారణమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శివరాం ప్రసాద్, పలువురు సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!