November 19, 2019

బాధితులే వ్యభిచార గృహ నిర్వాహకులు – నెల్లూరులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టింగ్… హిట్టయితే డైరెక్టుగా సినిమాల్లోకే…. అంటూ పలువురు యువతులను మాయమాటలతో నమ్మబలికి వారిని లోబర్చుకుని అనుభవించి ఆ దృశ్యాలను రహస్యంగా సెల్ ఫోన్లలో చిత్రీకరించి, బెదిరించి చివరకు వారినే వ్యభిచార గృహ నిర్వాహకులుగా మార్చే కేటుగాణ్ని నెల్లూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతనితో పాటూ వ్యభిచార గృహాలను నడుపుతున్న యువతులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అతగాడి బూతు పురాణమంతా నిర్లిప్తమై ఉన్న కంప్యూటర్ ను, సెల్ పోన్లను విచారణ కోసం పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లో కెళ్తే… నెల్లూరు జ్యోతి నగర్ కు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ అలియాస్ మహేష్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిమ్స్ పేరుతో అనేక మంది అమ్మాయిలకు వల వేశాడు. షార్ట్ ఫిలిమ్స్ లో ప్రతిభ చూపితే సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని అనేక మంది అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. వెండి తెరపై వెలిగిపోవాలన్న ఆశతో అనేక మంది అతని ఉచ్చులో ఇరుక్కుపోయారు. సినిమా అవకాశాలు కావాలంటే తన కోరిక తీర్చాలని బలవంత పెట్టేవాడు. సినిమా ఆశ మోజులో అనేక మంది అతని కోరికలకు బలైనారు. కొందరు మైనర్ బాలికలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అమ్మాయిలతో గడిపే సమయాల్లో ఆ దృశ్యాలను రహస్యంగా సెల్ ఫోన్లలో చిత్రీకరించేవాడు. తరువాత ఆ దృశ్యాలను చూపించి వ్యభిచారం చేయాలని లేదంటే న్యూడ్ వీడియోస్ ను యూ ట్యూబ్ లో పెడతానని బెదిరించేవాడు. దీంతో వారు వ్యభిచారం చేసేందుకు అంగీకరించే వారు. అలా వ్యభిచారంకు అలవాటు పడ్డ ఆ యువతుల చేతే నగరంలోని 6 చోట్ల వ్యభిచార గృహాలను పెట్టించాడు. ఇదే కోవలో కోవూరుకు చెందిన ఓ మైనర్ బాలికను వ్యభిచారం చేయాలని బలవంతం చేయగా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్ల సిఐలు వ్యభిచార గృహాల చిరునామాలు సేకరించి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ప్రధాన ముద్దాయి షేక్ జాకీర్ హుస్సేన్ తో పాటూ వ్యభిచార గృహాలు నడుపుతున్న బాధిత యువతులు, మహిళలను, విటులను అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి నగర్ లో వ్యభిచార గృహం నడుపుతున్న ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్, విరాట్ నగర్ లో వ్యభిచార గృహం నడుపుతున్న షేక్ నూరి, కోటమిట్టలో వ్యభిచార గృహం నడుపుతున్న పొంగూరు సుమ, బేతు శ్రీలక్ష్మి, కోవి మల్లీశ్వరి, పోస్టల్ కాలనీలో వ్యభిచారం గృహం నడుపుతున్న రామిశెట్టి లక్ష్మి, వేదాయపాళెంలో నిర్వహిస్తున్న మునగల శ్రీనివాసరావు, వనంతోపు సెంటర్ లో నిర్వహిస్తున్న కావలి సునీత, చిల్డ్రన్స్ పార్క్ వద్ద రాంజీనగర్ లో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న కారెడ్డి ప్రియాంక రెడ్డిలను అరెస్ట్ చేశారు. వారితో పాటూ విటులు అయిన యర్రంపల్లి ప్రభాకర్, యనకి నరసింహ, కొండాటి శ్రీనివాస్, విశ్వంశెట్టి సుమన్, బండ్ల వంశీ కృష్ణ లను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఇలాంటి వ్యక్తలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని యువతులకు సూచించారు. ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్ కు చెందిన కారు, బైక్, కంప్యూటర్, హార్డ్ డిస్క్ తో పాటూ, ముద్దాయిలకు సంభందించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మరో వైపు ఈ వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న యువతులతో నెల్లూరులోని ఓ పోలీస్ స్టేషన్ ఎస్సైకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సంఘటనలో అదుపులోకి తీసుకున్న కొందరు యువతులను రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు వదిలేసినట్లు కూడా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!