November 21, 2019

నమ్మకంగా పనిచేసి కారును దొంగిలించారు – ఇద్దర్ని అరెస్ట్ చేసిన బాలాజీనగర్ పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – యజమాని వద్ద నమ్మకంగా పనిచేసి చివరకు వారి కారుతో ఉడాయించారు ఇద్దరు దొంగలు. నెల్లూరు దర్గామిట్టకు చెందిన వొలిపేటి వెంకట సాయి, రాజేంద్రనగర్ కు చెందిన అరవ ప్రసాద్ అనే ఇద్దరు చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి కార్లను దొంగిలించడం వృత్తిగా పెట్టుకున్నారు. గతంలో కూడా వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయి ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల కృష్ణపట్నం పోర్టులో హెచ్.ఆర్. సీనియర్ మేనేజర్ గా పనిచేసే పత్రి శ్రీనివాస మూర్తికి చెందిన వెరిటో కారును దొంగిలించారు. దీనిపై కేసు నమోదు చేసిన బాలాజీ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారును దొంగిలించిన ఇద్దర్నీ గురువారం అరెస్ట్ చేసి, చోరీ చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ నగర్ సిఐ వై.వి. సోమయ్య విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరిపై గతంలో కేసులు నమోదయి ఉన్నాయని చెప్పారు. ముద్దాయిల్లో వలిపేటి వెంకట సాయి అనే వ్యక్తి గతంలో ఫిర్యాది అయిన పత్రి శ్రీనివాస మూర్తి వద్ద డ్రైవర్ పనిచేసి ఉన్నాడని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సైలు వీర ప్రతాప్, పవన్ కుమార్, అంకమ్మ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!