November 16, 2019

మహేంద్ర సింగ్ హత్య కేసులో పూర్తయిన అరెస్టుల పర్వం – షూటర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – గత ఏడాది నవంబర్ 3వ తేదీ రాత్రి నెల్లూరు ఫత్తేఖాన్ పేటలో మహేంద్ర సింగ్ అనే వ్యాపారిని కొందరు తుపాకీతో కాల్పిచంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న రాజస్థాన్ వాసులు మరియు మృతుడు మహేంద్రసింగ్ బంధువులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అలాగే కాల్పి చంపిన సమయంలో బైక్ నడిపిన ముంబైకి చెందిన కిరాయి హంతకుణ్ని కూడా ఇటీవల అరెస్ట్ చేసి జైలు పంపారు. తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి పరారీలో ఉండగా శనివారం అతన్ని కూడా అరెస్ట్ చేశారు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులు. రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాకు చెందిన ఉత్తమ్ సింగ్ అలియాస్ ఉత్తమ్ సింగ్ రాజ్ పుత్, ఉర్మీత్ సింగ్ అనే వ్యక్తి హతుడు మహేంద్ర సింగ్ ను తుపాకీతో షూట్ చేసి హత్య చేసిన వ్యక్తి. ఈ కేసులో ఇతను ఏ3గా ఉన్నాడు. మహేంద్ర సింగ్ బంధువుల వద్ద సుపారీ తీసుకుని ఈ హత్యకు పాల్పడ్డాడు. దీనిపై చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐ మధుబాబు, ఎస్సైలు జగత్ సింగ్, చిన్న బలరామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!