November 19, 2019

నెల్లూరుజిల్లాకు అక్రమంగా రేషన్ బియ్యం – ఇద్దరు చిత్తూరు జిల్లా వాసుల అరెస్ట్

Clock Of Nellore ( Manubolu ) – చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తి పరిసర గ్రామాల నుండి పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్ల ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేసి నెల్లూరు, తిరుపతి, రాయచోటిలోని మిల్లర్లకు ఎక్కువ ధరకు విక్రయించే ఇద్దరు వ్యక్తులను నెల్లూరుజిల్లాలోని మనుబోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3600 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై మనుబోలు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా అనుమానస్పదంగా వెళ్తున్న టాటా యోధా ట్రక్కును పరిశీలించారు. అందులో రేషన్ బియ్యం ఉండగా కాళహస్తి మండలం, బసవయ్యపాళెంకు చెందిన డ్రైవర్ కండిల బాలాజీ, ఆమందూరు గ్రామానికి చెందిన క్లీనర్ కాపులూరు సాయి సిద్ధార్ధను అదుపులోకి తీసుకుని విచారించగా ఇది బయటపడింది. చంద్రారెడ్డి, జనార్ధన్, రెడ్డి అనే వారు వీటిని తమ ద్వారా మిల్లర్లకు పంపిస్తుంటారని పోలీసులకు వారు తెలియజేశారు. దీనిపై గూడూరు రూరల్ సిఐ కె. రామకృష్ణారెడ్డి మనుబోలు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. డ్రైవర్, క్లీనర్ లను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ట్రక్కులో ఉన్న 3600 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో మిగతా ముద్దయిలను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!