November 19, 2019

కరుడుగట్టిన ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు – ఒకటిన్నర కిలో బంగారు స్వాధీనం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుతో పాటూ వివిధ జిల్లాల్లో చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులను నెల్లూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా, పొదిలికి చెందిన పెద్దినేని తిరుపతి స్వామి, చిత్తూరు జిల్లా గంగవరంకు చెందిన లేదోటి లక్ష్మీపతి అనే ఇద్దరూ పాత నేరస్తులు. నెల్లూరుతో పాటూ ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మొత్తం 21 ఇళ్లల్లో చోరీలు చేశారు. నెల్లూరులో నమోదైన కేసులపై దర్యాప్తు జరిపిన పోలీసులు తప్పించుకు తిరుగుతున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా వారి చోరీల సీరియల్ బయటపడింది. నాలుగు జిల్లాల్లో జరిగిన చోరీలకు సంభందించి ఉన్న 21 కేసులను దర్యాప్తు చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు. అన్నీ కేసుల్లో కలిపి ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3.5 కేజీల వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ఇద్దరిపై రౌడీషీట్ లు ఉన్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!