November 12, 2019

నెల్లూరులో వ్యభిచార గృహంపై దాడులు – ముగ్గురు అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) – గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతున్న ఓ ఇంటిపై సోమవారం తెల్లవారు జామున పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వ్యభిచారం చేయించేందుకు తీసుకొచ్చిన యువతిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. నెల్లూరు రాంజీనగర్ 7వ వీధిలో ఉన్న ఎస్ఎస్ విల్లా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 201లో వ్యభిచారం జరుగుతుందని బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిఐ సోమయ్య, ఎస్సైలు వీర ప్రతాప్, అంకమ్మలు తమ సిబ్బందితో కలిసి తెల్లవారు జామున ఆ నివాసంలో సోదాలు నిర్వహించగా అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడున్న కల్లూరుపల్లికి చెందిన చక్కిరాల రామచంద్ర, వెంకటేశ్వరపురంకు చెందిన సూరాయపాళెం సుభాషిణి, రంగనాయకులపేటకు చెందిన సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ లను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం అక్కడకు తీసుకొచ్చిన 32 ఏళ్ల మహిళను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితులు ముగ్గుర్ని సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఇంట్లో లభించిన 13,760 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 8 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!