November 21, 2019

గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన నెల్లూరు పోలీసులు – విద్యార్ధులే స్మగ్లర్లుగా మారిన వైనం

Clock Of Nellore ( Nellore ) – తమిళనాడులోని విట్ ఇంజనీరింగ్ కళాశాలలో గంజాయి వాడకానికి అలవాటు పడి తర్వాత వారే గంజాయి స్మగ్లర్లుగా మారి అదే కళాశాలకు గంజాయిని సరఫరా చేస్తున్న 5 మంది విద్యార్ధులను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లో కెళ్తే… శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుంకరి పవన్ కళ్యాణ్, విశాఖపట్నంకు చెందిన కిలాస్ లోక్ నాథ్ అఖిల్, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ప్రత్యూష్ సిన్హా, విజయనగరం జిల్లాకు చెందిన బండారు రవితేజ, నెల్లూరుజిల్లా వాసి ప్రస్తుతం తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాలో ఉండే పాలేటి అమర్నాథ్ లు విట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. ఒకటిన్నర సంవత్సరం నుండి వీరు గంజాయికి బానిసగా మారారు. తమిళుల నుండి వీరితో పాటూ మరికొందకు విద్యార్ధులు గంజాయిని కొనగోలు చేసి వాడే వారు. ఇటీవల ఈ 5 మంది తామే గంజాయి సరఫరా చేస్తే ఆదాయం ఉంటుంది కదా అని పథకం రచించి స్మగ్లర్లుగా అవతారమెత్తారు. అద్దె కార్లలో విశాఖ ఏజన్సీ ప్రాంతానికి వెళ్లి గంజాయిని తమ కళాశాలకు తీసుకెళ్లే వారు. అక్కడ విద్యార్ధులకు గంజాయిని విక్రయించే వారు. ఈ క్రమంలో తాజాగా అదే విధంగా ఈ 5 మంది అద్దె కారులో విశాఖ నుండి 16కేజీల గంజాయిని కొనుగోలు చేసి వోక్స్ వేగన్ కారులో ఉంచి నెల్లూరు మీదుగా చెన్నై తరలించేందుకు ప్రయత్నించారు. గంజాయి స్మగ్లింగ్ పై దృష్ఠి పెట్టిన జిల్లా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి వద్ద ఇదే మాదిరిగా తనిఖీ చేయగా ఈ ముఠా గుట్టు రట్టైంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం సాయంత్రం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో కావలి డిఎస్పీ, సిఐ శ్రీనివాసన్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఒక లక్షా 60వేలు ఉంటుందని అన్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!