November 16, 2019

నేలపాలైన మంచినీరు – నెల్లూరులో వాటర్ ఫాల్స్ ను తలపించిన పైప్ లైన్ లీకేజీ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని రామలింగాపురం సర్కిల్ వద్ద సర్వేపల్లి కాలువ వంతెనపై నున్న ప్రధాన తాగునీటి పైప్ లైన్ వాల్వ్ వద్ద మంగళవారం ఉదయం లీకేజీ ఏర్పడింది. పైప్ లైన్ లో నీటి సరఫరా వేగంగా ఉండటం అదే సమయంలో లీకేజీ ప్రదేశం కూడా పెద్దది కావడంతో నీరు ఆకాశంలోకి చిమ్ముతూ ఎగిరిపడ్డాయి. దాదాపు రెండు గంటల పాటూ ఈ లీకేజీ కొనసాగింది. నీళ్లు ఉవ్వేత్తున ఎగసి పడ్డాయి. 30 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతూ 50 అడుగుల దూరం వరకూ విరజిమ్మాయి. వాటర్ లీకయ్యి సమీపంలో ఉండే విద్యుత్ తీగలపై పడుతుండటంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసి విద్యుత్ సరఫరాను నిలిపించారు. ఆలస్యంగా అక్కడకు చేరుకున్న కార్పొరేషన్ సిబ్బంది లీకేజికి తాత్కాలికంగా రబ్బరును చుట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!