November 22, 2019

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి – సచివాలయ సిబ్బంది శిక్షణ ముగింపులో కమీషనర్ సూచన

Clock Of Nellore ( Kovur ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన శిక్షణా తరగతులను మూడవ బృందం విజయవంతంగా పూర్తి చేసిందని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి తెలిపారు. రామన్నపాలెంలోని ఆదిశంకర కళాశాలలో జరుగుతున్న ముగింపు శిక్షణా తరగతులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మూడవవిడతలో 340 మంది అభ్యర్థులకు నిష్ణాతులైన సిబ్బందితో శిక్షణ అందించి, వివిధ అంశాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. సోమవారం నుంచి నాల్గవ బృందానికి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని, అభ్యర్థులు కచ్చితంగా కళాశాల ప్రాంగణానికి సూచించిన సమయానికి చేరుకోవాలని కమిషనర్ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విమెన్ ప్రొటెక్షన్, ఏ.ఎన్.ఎమ్, విఆర్వో విభాగ కార్యదర్శుల అభ్యర్థులను సోమవారం నుంచి విధుల్లోకి తీసుకుని, సమస్యల పరిష్కారానికి ప్రజలతో నేరుగా సంబంధాలు కల్పించనున్నామని కమిషనర్ స్పష్టం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!