November 12, 2019

నెల్లూరు కార్పొరేషన్ లో 97.5 శాతం ఫిర్యాదులకు పరిష్కారం – స్పందనలో వెల్లడించిన కమీషనర్ మూర్తి

Clock Of Nellore ( Nellore ) – ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమాన్ని నెల్లూరు నగర పాలక సంస్థలో విజయవంతంగా నిర్వహిస్తూ, ఫిర్యాదులకు మెరుగైన పరిష్కారాలు అందిస్తున్నామని కమిషనర్ పివివిఎస్ మూర్తి పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలోని కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలను కమిషనర్ సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై ప్రజల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతోందని, సమస్యల పరిష్కారానికి చక్కటి వేదికలా అందరూ భావిస్తున్నారని తెలిపారు. హౌసింగ్, మెప్మా, రెవెన్యూ, అకౌంట్స్, ఎస్టాబ్లిష్ మెంట్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి 2,528 ఫిర్యాదులను ఇప్పటివరకు అందుకుని, వాటిలో 2,517 సమస్యలకు పరిష్కారం అందించామని కమిషనర్ తెలిపారు. 97.5 శాతం ఫిర్యాదులకు పరిష్కారం చూపి కార్పొరేషన్ సేవలను విస్తృతం చేస్తున్నామని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఆదేశిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. అందుకున్న విజ్ఞప్తులను ఆన్లైన్ విధానం ద్వారా సంబంధిత విభాగాలకు పంపి, పరిష్కారానికి పట్టే సమయాన్ని సైతం ఫిర్యాదుదారులకు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమిష్టి కృషితో, ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నిర్వహిస్తామని కమిషనర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!