November 12, 2019

ఉగాదికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు – వెల్లడించిన కమీషనర్ పివివిఎస్ మూర్తి

Clock Of Nellore ( Nellore ) – స్వంత ఇంటి నివేశన స్థలాలు లేని అర్హులందరికీ స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో పటిష్టంగా నిర్వహిస్తున్నామని కమిషనర్ పివివిస్ మూర్తి తెలిపారు. స్థానిక 33 వ డివిజన్ వెంగళరావు నగర్ మున్సిపల్ పాఠశాలలో వైసీపి డివిజన్ ఇంఛార్జ్ బెజవాడ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు సభలో ఆయన శనివారం పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకంలో అర్హులందరినీ తొలివిడతలో గుర్తించి, వారందరికీ ఉగాది నాటికి స్థలాలు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేసామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కార్పొరేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో డోర్ టు డోర్ విచారణ జరిపి అర్హులను గుర్తించామని, వారి జాబితాలను అన్ని వార్డు సభల్లో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. అర్హులైనప్పటికీ జాబితాలో పేరు నమోదు కాకపోతే సంబంధిత వార్డు సభ సిబ్బంది ద్వారా అధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. అనర్హులైన వారి పేర్లు జాబితాలో ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అర్హులైన వారందరికీ ఇంటి నివేశన స్థలాల పట్టాలను మంజూరు చేసి, ఇంటి నిర్మాణ బాధ్యతలు సైతం ప్రభుత్వం చేపట్టనుందని కమిషనర్ స్పష్టం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!