November 16, 2019

ఘనంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు – పలు చోట్ల సేవా కార్యక్రమాలు

Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. ఉదయం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వింధ్యావళిని వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులు ఆయన పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయా డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసిపి నేతలు డాక్టర్ పేనేటి సునీల్, తాళ్లూరి అవినాష్ తదితరులు గజమాలతో ఆదాలను సత్కరించారు. పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!