November 12, 2019

ఇసుకపై కార్మికుల్లో హర్షం – ఎమ్మెల్యే కోటంరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు వాసులకు ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం నుండి ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భవన నిర్మాణ కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. పొట్టేపాళెం ఇసుక రీచ్ నుండి కేవలం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ వాసులే ఇసుకను పొందేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇసుక కొరతతో గత కొద్ది రోజుల నుండి ఉపాధిలేక ఇళ్లకే పరిమితమైన భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు పొదలకూరురోడ్డులోని నిప్పో సెంటర్ లో 33వ డివిజన్ వైసీపి ఇంఛార్జ్ బెజవాడ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో కార్మికులు కోటంరెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. నెల్లూరు వాసులకు ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి తమకు తిరిగి ఉపాధిని చూపించిన కోటంరెడ్డికి ధన్యవాదాలు అంటూ అన్నారు. సామాన్య కార్మికుల కష్టాలను గుర్తించి ప్రత్యేక ఉత్తర్వులు ఇప్పించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎప్పుడూ ప్రజల పక్షమేనని మరో సారి నిరూపించుకున్నారని కొనియాడారు. 33వ డివిజన్ వైసీపి ఇంఛార్జ్ బెజవాడ మేఘనాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రతిపక్షమైనా… అధికార పక్షమైనా… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజా పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారమే అజెండాగా పనిచేయడం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అధృష్ఠమని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!