October 19, 2019

జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన కిషోర్స్ రత్నం స్కూల్ విద్యార్ధిని

Clock Of Nellore ( Nellore ) – జాతీయ స్థాయి ఫుట్ బాల్ జట్టుకు నెల్లూరులోని డాక్టర్ కిషోర్స్ రత్నం మెడికల్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్ధిని ఎంపికైంది. గత నెల 28, 29,30వ తేదీల్లో మదనపల్లెలో జరిగిన 65వ రాష్ట్ర స్థాయి స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ లో కిషోర్స్ రత్నం స్కూల్ 10వ తరగతి విద్యార్ధిని ఎస్. సాయి అర్మిత రెడ్డి ఫుట్ బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరచమే కాకుండా నెల్లూరు జట్టు విజయానికి దోహదపడింది. ఈ నేపద్యంలో రాష్ట్ర ఫుట్ అసోసియేషన్ జాతీయ స్థాయి పోటీలకు అర్మిత రెడ్డిని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కిషోర్స్ రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రామమూర్తి నాయుడు అర్మిత రెడ్డిని అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభను కనబరచి విజయం సాధించాలని స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ కిషోర్ ఆకాంక్షించారు. స్కూల్ ప్రిన్సిపల్ మణిమాల, మేనేజర్ అజయ్ సింగ్ కూడా ఆమెను అభినందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!