January 23, 2020

నెల్లూరులో మీసేవా సెంటర్ల అక్రమాలు – సీజ్ చేసిన జేసీ వెట్రి సెల్వి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పలు మీ సేవా సెంటర్లలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం దర్గామిట్టలోని ఎమ్.జి. మాల్ ఎదురుగా ఉన్న మీ సేవా సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి అవకతవకలను గుర్తించారు. ఒక్క అనుమతితో రెండు మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. తమ కార్డులు గల్లంతయ్యాయని, తమకు తెలియకుండానే కుటుంబసభ్యుల పేర్లు మారిపోయాయని పలువురు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన జేసీ, మార్పులన్నీ ఎమ్.జి. మాల్ ఎదురుగా ఉన్న మీ సేవా కేంద్రం నుండే జరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులతో కలిసి ఆమె ఆ మీ సేవా కేంద్రాన్ని తనఖీ చేయగా అక్రమాలు కుప్పలు తెప్పులుగా బయటపడ్డాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకూ రేషన్ కార్డులకు సంభంచిందిన వివరాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో మీసేవా అక్రమాల గుట్టు బయటపడింది. వివిధ రేషన్ కార్డుల్లో 345 పేర్లను కలిపినట్లు గుర్తించారు. 207 మంది పేర్లను తొలగించారు. 227 మంది పేర్లను మార్పు చేశారు. 420 కార్డుల్లో వారి కుటంబసభ్యుల పేర్లను పూర్తిగా తొలగించినట్లు జేసీ పరిశీలనలో స్పష్టమైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ వెట్రి సెల్వి అక్కడికక్కడే ఆ మీ సేవా కేంద్రాన్ని మూయించివేసి చర్యలకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు అర్భన్ తహసీల్ధార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో ఈ అక్రమాలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల్లో మార్పుల కోసం ధరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు పత్రాలైనా ఉండాలని కానీ ఇక్కడ అవేమీ కనిపించలేదని అన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం నెల్లూరు అర్బన్ తహసీల్ధార్ కార్యాలయానకి చేరుకుని తనిఖీలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!