November 19, 2019

కండలేరు నుంచి చెన్నైకు తాగునీరు – విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు

Clock Of Nellore ( Rapur ) – నెల్లూరుజిల్లాలోని కండలేరు జలాశయం నుండి చెన్నైకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల ఒప్పందం మేరకు కండలేరు నుండి ఏటా 4 TMCల నీటిని చెన్నైకు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో సోమశిల జలాశయంలో నీటి నిల్వ 70 TMCలకు చేరువైంది. అదే క్రమంలో సోమశిల నుండి కండలేరుకు నీటిని విడుదల చేశారు. కండలేరులో పూర్తి స్థాయి నీటి మట్టం రావడంతో అధికారులు బుధవారం సాయిగంగ కాలువ ద్వారా చెన్నైకి నీటిని విడుదల చేశారు. ముందుగా 500 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. క్రమేపి దానిని పెంచనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!