January 23, 2020

విషజ్వారాల బారిన నెల్లూరు నగరం – “పరిష్కారం” లో వెల్లడించిన మాజీ మేయర్ అబ్ధుల్ అజీజ్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని, ప్రత్యేకించి డెంగీ జ్వరాలు అధికంగా ప్రభలుతున్నాయని నగర మాజీ మేయర్ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ అబ్ధుల్ అజీజ్ అన్నారు. శనివారం నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆయన పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురి నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ నగరంలో డెంగీ జ్వరాలు విపరీతంగా ప్రభలుతున్నాయని, అనేక మంది దాని బారిన పడి మృత్యువాత పడ్డారని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్, నెల్లూరు కార్పొరేషన్ దృష్ఠి సారించి దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో తాము దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టినప్పుడు వైసీపి నేతలు అవహేళన చేశారని గుర్తు చేశారు. దోమల వల్ల ఎంత మంది చనిపోతున్నారో అర్ధమవుతుందా అని వైసీపి నేతలను ప్రశ్నించారు. నెల్లూరులోని మార్కెట్ వద్ద తాము స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే దాన్ని నిర్వీర్యం చేశారని, మహిళా జూనియర్ కళాశాలలో వసతులు లేవని దీనిపై కలెక్టర్ దృష్ఠి పెట్టాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు సమర్పించే అర్జీలకు సకాలంలో పరిష్కారం లభించడం లేదని అంటూ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అజీజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!