November 16, 2019

ఆత్మకూరులో వాటర్ ప్లాంట్లపై దాడులు – శాంపిల్స్ సేకరణ – మూసివేతకు రంగం సిద్దం

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లాలో అనధికారికంగా కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ కొరఢా జుళిపిస్తున్నారు. శనివారం ఆయన ఆత్మకూరు పరిధిలోని పలు వాటర్ ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించారు. పమిడిపాడులోని ఓ తోటలో నిర్వహిస్తున్న ఎమ్.వి.ఎన్. వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేసి పలు లోపాలను గుర్తించారు. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్యాకెట్ల తయారీ, బాటిల్స్ తయారు చేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్బంగా ఫుడ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు బిఐఎస్ సర్టిఫికేట్ పొందాలని చెప్పారు. ఆ సర్టిఫికేట్ లేకుండా వాటర్ ప్యాకెట్లు గానీ బాటిల్స్ గానీ విక్రయించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. జిల్లాలో వాటర్ ప్యాకెట్స్, బాటిల్స్ ద్వార నీటిని విక్రయించేందుకు కేవలం 6 ప్లాంట్లకే అనుమతులు ఉన్నాయని మిగిలిన వాటికి అనుమతి లేదని వెల్లడించారు. బిఐఎస్ అనుమతులు, హైజనిక్ కండీషన్ లేకుండా కూల్ వాటర్ క్యాన్ల ద్వారా విక్రయించకూడదన్నారు. ఆత్మకూరులో అన్నీ వాటర్ ప్లాంట్లకు నోటీసులు జారీ చేశామని తర్వాత తహసీల్ధార్ ద్వారా వాటిని మూయించివేస్తామని శ్రీనివాస్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!