November 22, 2019

ఉచితంగా ఇస్తున్న ఇసుకను సమస్యగా మార్చారు – ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మేయర్ అజీజ్

Clock Of Nellore ( Nellore ) – చంద్రబాబునాయుడు హయాంలో ప్రజలందరికీ ఉచితంగా అందుతున్న ఇసుకను మీ తప్పుడు విధానాల వల్ల సమస్యగా మార్చారని నెల్లూరు మాజీ మేయర్ షేక్ అబ్ధుల్ అజీజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత టిడిపి ప్రభుత్వం కంటే మెరుగైన పాలసీని తీసుకొస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఉపాధి లేక 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడేలా చేశారని విమర్శించారు. నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమంగా సృష్ఠించిందేనని ఆరోపించారు. ఇసుక కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా బుధవారం నెల్లూరులో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అజీజ్ పేర్కొన్నారు. తక్షణం ఇసుక పాలసీని మార్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని అజీజ్ ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!