November 21, 2019

హౌడీ… మోడీ… లో నెల్లూరు పారిశ్రామిక వేత్తలు సందడి… ప్రధానితో కరచాలనం…

Clock Of Nellore ( America ) – అమెరికాలోని హ్యూస్టన్ లో భారత కాలమానం ప్రకారం ఆదివారం హౌడీ… మోడీ… కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయుల సమ్మేళనంతో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అతిధులుగా పాల్గొని ఇరుదేశాల మైత్రీపై ప్రసంగించారు. మరో వైపు అమెరికా స్థిరపడ్డ నెల్లూరు వాసులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి సందడి చేశారు. నెల్లూరుకు చెందిన అథ్వైత్ అల్గారిథమ్ సాఫ్ట్ వేర్ సంస్థ ఫౌండర్ మరియు సిఈఓ అళహరి సుజిత్ కూడా పాల్గొన్నారు. హౌడీ మోడీ కార్యక్రమంలో భారత దేశ జాతీయ పతాకాన్ని సమావేశంలో రెపరెపలాడించారు. సమావేశం అనంతరం భారత పారిశ్రామిక వేత్తలతో కలిసి మోడీ మరియు ట్రంప్ తో కరచాలనం చేశారు. నెల్లూరుకు చెందిన అళహరి సుజిత్ కొన్నేళ్ల కిందట అమెరికాలో స్థిర పడ్డారు. సాఫ్ట్ వేర్ రంగంలో పూర్తి స్థాయి అవగాహన ఉన్న సుజిత్ అక్కడే అధ్వైత్ అల్గారిథమ్ పేరుతో ఆర్.పి.ఓ సాఫ్ట్ వేర్ సంస్థను నెలకొల్పారు. వేలమందికి ఆ సంస్థ ద్వారా ఉపాధి కల్పించారు. సొంత గడ్డపై ఉన్న మమకారంతో నాలుగేళ్ల క్రితం నెల్లూరులో కూడా అదే పేరుతో సాఫ్ట్ వేర్ సంస్థను ఏర్పాటు చేశారు. నెల్లూరులో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని మంగళగిరిలో కూడా మూడేళ్ల క్రితం అధ్వైత్ అల్గారిథమ్ ను ఏర్పాటు చేసి వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అమెరికాతో పాటూ నెల్లూరు, విజయవాడ సంస్థలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అమెరికాలోని ఆర్.పి.ఓ సంస్థల్లో అద్వైత్ అల్గారిథమ్ మొదటి స్థానంలో నిలిచింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!