November 19, 2019

నెల్లూరు నగరంలో భయపెడుతన్న ప్లాస్టిక్ భూతం – డ్రైనేజీ కాలువల్లో తీసే కొద్దీ ప్లాస్టిక్ వ్యర్ధాలు

Clock Of Nellore ( Nellore ) – ప్లాస్టిక్ వాడకం ఎంత అనర్ధమో… ఈ దృశ్యాలను చూస్తే మీకే అర్ధమవుతుంది. నెల్లూరు నగరంలోని అన్నీ మురుగు కాలువల్లో 90 శాతం ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరిపోయి ఉన్నాయి. ఫలితంగా మురుగునీరు బయటకు వెళ్లకుండా రోడ్లపైనే పొంగిపొర్లుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా డ్రైనేజీ కాలువల్లో నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోడ్లపైనే ఏరులై పారుతున్నాయి. నగర ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను వాడి ఎక్కడంటే అక్కడ పడేయటంతో అవి కాలువల్లోకి చేరుతున్నాయి. చివరకు ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆదివారం సాయంత్రం నెల్లూరు కొత్తహాలు ముందు డివైడర్ మధ్యలో నెల్లూరు కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బంది మ్యాన్ హోల్ ను తెరిచి చూడగా కాలువలో మొత్తం ప్లాస్టిక్ వ్యర్ధాలే దర్శనమిచ్చాయి. దీంతో అధికారులు సూచనలతో వ్యర్ధాలను వెలికితీసే ప్రయత్నం చేయగా తీసే కొద్దీ ప్లాస్టిక్ వ్యర్ధాలు వస్తూనే ఉన్నాయి. రెండు ట్రాక్టర్ల ట్రక్కులు నిండేెంతగా ప్లాస్టిక్ వ్యర్ధాలు బయటపడ్డాయి. ఇప్పటికైనా ప్లాస్టిక్ ను వాడటం మానేస్తే అనేక రకాల సమస్యల నుండి ప్రజలు బయటపడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!