November 22, 2019

సిఎం జగన్ వద్దకు చేరిన కోటంరెడ్డి, కాకాణి పంచాయితీ – మంత్రితో కలిసి బయలుదేరి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మధ్య వివాదం పోలీస్ కేసుల వరకూ వెళ్లిడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై దృష్ఠి సారించారు. బుధవారం సాయంత్రం తర్వాత తాడేపల్లిలోని తన నివాసం వద్ద అందుబాటులో ఉండాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి వర్తమానం పంపారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తో కలిసి అమరావతికి బయలుదేరారు. ఈ రోజు రాత్రిలోగా కానీ లేదా రేపు ఉదయం గానీ ముఖ్యమంత్రి జగన్ ఇద్దరితో మాట్లాడనున్నారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సమక్షంలో వీరి పంచాయితీ జరగనుంది. జగన్ తో భేటి తర్వాత ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం సద్దుమణుగుతుందా లేదా అలాగే కొనసాగుతుందా అనేది తర్వాత తెలియనుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తన వాదనను జగన్ కు గట్టిగానే చెప్పాలని నిర్ణయించుకున్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనను రాజకీయంగా ఎదగనీయకుండా కాకాణి గోవర్ధన్ రెడ్డి మరికొందరితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేందుకు సిద్దపడ్డారు. చివరకు ఓ ఎమ్పీడిఓ చేత తనపై కేసు పెట్టించారని అదెక్కడి న్యాయమన్న విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద విరిద్దరి వివాదం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!