November 21, 2019

మర్రిపాడు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు – ఏడు మంది అరెస్ట్ – దుంగలు స్వాధీనం

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లాలోని మర్రిపాడు అడవుల్లో నక్కిఉన్న ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలోని సీతారాంపురం, అనంతసాగరం, పొదలకూరు మండలాలకు చెందిన బొగ్గవరపు మాలకొండయ్య, చల్లా తిరుపతయ్య, బొల్లినేని చిన వెంకట సుబ్బయ్య, సవరం రమణయ్య, బిల్లుపాటి కొండయ్య, మోపూరు సుబ్రమణ్యం, మల్లిక అంకయ్య అనే ఏడు మందితో పాటూ మరో 5 మంది ముఠాగా ఏర్పడి మర్రిపాడు మండలంలోని పడమటినాయుడుపల్లి – చుంచులూరు గ్రామ అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు అటవీ ప్రాంతంలో మెరుపుదాడులు నిర్వహించారు. పోలీసులు దాడులతో వారంతా పరారయ్యే ప్రయత్నం చేయగా ఏడు మంది పట్టుబడ్డారు. మరో 5 మంది పరారయ్యారు. వారి వద్ద నుండి తరలించేందుకు సిద్దంగా ఉన్న 25లక్షల విలువైన 44 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆత్మకూరు డిఎస్పీ మగ్భుల్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను తెలియజేశారు. పట్టుబడ్డ ఏడు మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. పరారయిన 5 మంది కోసం గాలింపు చేపట్టామని వారిని కూడా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆత్మకూరు సిఐ పాపారావు, మర్రిపాడు ఎస్సై రాకేష్, అనంతసాగరం ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!