November 19, 2019

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు నెల్లూరు క్రీడాకారులు – క్రీడా దుస్తులను అందజేసిన అసోసియేషన్

Clock Of Nellore ( Nellore ) – అనంతపురం జిల్లాలోని రాప్తాడులో రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. అండర్ – 14 విభాగంలో జరగనున్న ఈ పోటీలకు నెల్లూరు జిల్లా తరపున బాల, బాలికల జట్లు బయలుదేరి వెళ్లాయి. ఈ నేపద్యంలో బాలబాలికల జట్లకు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాలకొండయ్య క్రీడా దుస్తులను అందజేశారు. నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి క్రీడా కారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరు జట్లు జయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో సాఫ్ట్ బాల్ క్రీడ అభివృద్ధికి అసోసియేషన్ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మలిరెడ్డి కోటారెడ్డి, కార్యదర్శి సుబ్బరాజు, చీఫ్ కోచ్ యతిరాజులు, మాజీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!