November 22, 2019

దేవాదాయ భూముల లీజులు రద్దు చేయండి – అధికారులను ఆదేశించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో దేవాదాయశాఖకు సంబంధించిన భూముల లీజులు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నెల్లూరులోని కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన దేవాదాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. వివాదంలో ఉన్న దేవాదాయశాఖ పరిధిలోని భూములకు పరిష్కారం చూపేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల దేవాదాయశాఖ పరిధిలో ఉన్న వేలాది ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నట్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందాయని వారికి గుర్తు చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖల సంయుక్త సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నవంబర్ 10వ తేదీ నాటికి దేవాదాయశాఖకు సంబంధించిన అన్నీ ఆస్తులను కంప్యూటరైజేషన్ చేయాలని ఆదేశించారు. దేవాదాయశాఖకు సంబంధించి భూములు లీజుకు ఇచ్చి ఉంటే ఆ లీజులు రద్దు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ డిప్యూటి కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సహాయ కమీషనర్ రవీంద్రరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!