November 12, 2019

ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు – సినిమా హాళ్ల దోపిడిపై కలెక్టర్ ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) – సినిమా హాళ్లలో తిను బండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించడంపై జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీకి మించి అధికంగా వసూలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శేషగిరి బాబు తూనికలు, కొలతలు శాఖ అధికారులతో గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. నెల్లూరులోని మాల్స్, సినిమా థియేటర్లతో పాటూ జిల్లాలోని ఇతర థియేటర్లలో తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయిస్తూ వాటి యాజమాన్యాలు ప్రజల నుండి దోపిడీ చేస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ థామస్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీనా సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించి 4 కేసులు నమోదు చేశామని కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ శేషగిరి బాబు మాట్లాడుతూ సినిమా థియేటర్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించే థియేటర్ల యాజమాన్యాలకు జరిమానా విధించాలని సూచించారు. అంతే కాకుండా ఈ విషయంలో అక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!