January 23, 2020

నిరుద్యోగ యువత ఉపాధిపై 4 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళిక – వెల్లడించిన కలెక్టర్ శేషగిరి బాబు

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలోని 80 శాతం మంది నిరుద్యోగ యువతకు నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనకై 4 రోజుల్లోగా జిల్లా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నెల్లూరుజిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరులోని కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంధ సంస్థలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఒక సాఫ్ట్ వేర్ వేదిక సృష్ఠించాలని సూచించారు. ఇందుకోసం పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలను గుర్తించి వారికి అవసరమైన డేటా బేస్ వివరాలతో 4 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా, విభాగాల వారీగా శిక్షణలు, ఎక్స్ పోజర్ విజిట్ లు, ఇంటర్న్ షిప్పులు, మ్యాట్రిక్స్ ప్రణాళిక పొందుపరచాలని సూచించారు. జిల్లాలోని 80 శాతం మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ వారికి వివరించారు. ఇకపై దీనిపై ప్రత్యేక దృష్ఠి సారిస్తానని, రెండు రోజులకు ఒక సారి సమావేశం నిర్వహించి సమీక్షిస్తామన్నారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఏ పిడి శీనా నాయక్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!