December 16, 2019

నెల్లూరులో అపరిశుభ్రత పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం – ముగ్గురికి షోకాజ్ నోటీసులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో అపరిశుభ్రత పై జిల్లా కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం నగర పరిధిలోని శంకర అగ్రహారం, కాపాడి పాలెం లో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్యం తో పాటు మురుగు నీటి కాలువలను పరిశీలించారు. పలుచోట్ల నెలకొన్న అపరిశుభ్రత పై కార్పొరేషన్ హెల్త్ అధికారులను మందలించారు. పారిశుధ్య విధుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంత మంది పనిచేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లో విధులకు హాజరైనట్లు నమోదు కాబడి, విధుల్లో లేకుండా ఉన్న కొంత మందిని గుర్తించారు. తక్షణం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ మూర్తిని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!