November 12, 2019

తుఫాన్ల సీజన్ అప్రమత్తంగా ఉండండి – జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ శేషగిరి బాబు

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలోఈశాన్య రుతుపవనాల దృష్ఠ్యా తుఫాన్లు సంభవించే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నెల్లూరుజిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు డివిజన్ స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ లోపు సమావేశం నిర్వహించి కార్యాచరణను సిద్దం చేయాలన్నారు. అలాగే మండల స్థాయిలో తహసీల్ధార్లకు సమావేశాలు నిర్వహించి తుఫాను సంభందించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత గ్రామాలను తనిఖీ చేయాలని, తుఫాను సంభవించినప్పుడు కావల్సిన నిల్వలను గుర్తించాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు. కమ్యునికేషన్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా తగిన ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. బియ్యం, మంచినీరు, పాలు, మందులు వంటి నిత్యావసర సరుకులను సిద్ధంగా ఉంచుకోవాలని, పునరావాస కేంద్రాలను గుర్తించి బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని కలెక్టర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!