January 23, 2020

అలివిగానీ హామీలతో ప్రజలపై భారం మోపుతున్నారు – జగన్ పై కోటంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) – ఎన్నికల సమయంలో అలివిగానీ హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చేందుకు ప్రజలపై భారం మోపేవిధంగా వివిధ రకాల ఛార్జీలను పెంపుదల చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ పై నుడా మాజీ ఛైర్మైన్ మరియు నెల్లూరుసిటీ టిడిపి అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై పైసా భారం కూడా మోపనని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ నేడు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని దుయ్యబట్టారు. నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆరు నెలల్లోనే జగన్ పరిపాలన ఎలాంటిదో ప్రజలకు అర్ధమైపోయిందని, త్వరలో విద్యుత్ ఛార్జీలను కూడా పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగన్ బీహార్ తరహా నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఉల్లి ధరలు తగ్గించలేని సిఎం జగన్ ప్రత్యేక హోదా తెస్తాననడం హాస్యాస్పదంగా ఉందని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. తక్షణం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేసిఆర్ తరహా పాలనను చూసి జగన్ కాపీ కొడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలు జగన్ ను డీబార్ చేయడం ఖాయమని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, అంచూరు శ్రీనివాసులు నాయుడు, మేకల రామ్మూర్తి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!