November 22, 2019

వర్షాలతో జలమయమైన నెల్లూరు శివారు ప్రాంతాలు – అనేక చోట్ల ప్రజలకు ఇబ్బందులు

Clock Of Nellore ( Nellore ) – ఆదివారం నుండి కురుస్తున్న వర్షాలతో నెల్లూరు నగర శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిపోయాయి. అనేక చోట్ల రహదారులు నీటి గుంటలుగా దర్శనమిస్తున్నాయి. వాగులు పొంగి నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయి. శివారు ప్రాంతాలైన కొత్తూరు, శ్రామికనగర్, చంద్రబాబు కాలనీ, రామకోటయ్యనగర్, వైఎస్ఆర్ నగర్, సుందరయ్య కాలనీ తదితర కాలనీల్లో వర్షపు నీరు చేరిపోయాయి. వర్షపునీరు ఇళ్లల్లోకి రావడంతో పాటూ రోడ్లను ముంచేశాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వర్షపు నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!