November 12, 2019

దొంగలుగా మార్చిన వ్యసనం – నెల్లూరులో ఇద్దరు యువకులు అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) – ఆ ఇద్దరి యువకులకు పట్టుమని ఇరవై ఏళ్లు కూడా లేవు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో చెడు వ్యసనాలకు బాలిసలయ్యారు. డబ్బులేక చివరకు దొంగల అవతారమెత్తి పోలీసులకు చిక్కిపోయారు. నెల్లూరు కోటమిట్టకు చెందిన సయ్యద్ తౌకీర్, జెండా వీధికి చెందిన సయ్యద్ తౌకీర్ హుస్సేన్ అనే ఇద్దరు యువకులు ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీనా రాత్రి గంట వ్యవధిలో రెండు చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డారు. బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న చీదెళ్ల సుశీల అనే వృద్దురాలి మెడలోని బంగారు సరుడును స్కూటీపై వెళ్లి క్షణాల్లో లాక్కొని పరారయ్యారు. అదే రోజు గంట వ్యవధిలో సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రారెడ్డి హాస్పిటల్ వద్ద నిలబడి ఉన్న వేలూరు విజయమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. దీనిపై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీనిపై నెల్లూరులోని సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిసి టీవి ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు ఇద్దరు యువకులపై నిఘా ఉంచారు. నేరానికి పాల్పడింది వారే అని నిర్ధారించుకుని బుధవారం ఇద్దరిని అరెస్ట్ చేసి లక్షా 20వేలు విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. సిసిఎస్ సిఐ బాజీజాన్ సైదా విలేకరుల సమావేశం నిర్వహించి ఇద్దర్నీ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!