December 16, 2019

డాక్టర్ బిందుమీనన్ కు ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధుమీనన్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్ ను అందుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఇయాన్కన్ ( ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ) – 2019 సదస్సును భారత ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సదస్సులో భాగంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రపంచ అధ్యక్షులు డాక్టర్ సతీష్ ఖాడిల్కర్… డాక్టర్ బింధుమీనన్ కు ఇయాన్కన్ ఫెలోషిప్ ను ప్రధానం చేశారు. నాలుగు రోజుల పాటూ జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలకు చెందిన నిపుణులు, మన దేశానికి చెందిన 2500 మంది న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు పాల్గొన్నారు. విద్యా నైపుణ్యం, పరిశోధన కార్యక్రమాలు, పత్రికల్లో మరియు పుస్తకాల్లో ప్రచురణలు, సామాజిక కార్యక్రమాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ సంస్థ ఫెలోషిప్ లను అందజేస్తుంటుంది. ఈ ఏడాది భారత దేశం మొత్తం 8 మందికి ప్రధానం చేయగా అందులో డాక్టర్ బింధుమీనన్ కూడా ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రపంచ అధ్యక్షులు డాక్టర్ సతీష్ ఖాడిల్కర్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ పాల్, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఎండి మరియు సిఈఓ డాక్టర్ బి. భాస్కర్ రావు, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షులు డాక్టర్ విలియం కారోల్, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజి కార్యదర్శి డాక్టర్ గగన్‌దీప్ సింగ్ పాల్గొన్నారు. మరో వైపు ప్రతిష్ఠాత్మక ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్ అందుకున్న డాక్టర్ బింధుమీనన్ కు నెల్లూరు అపోలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ నవీన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!