November 12, 2019

సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ సాధిఖ్ కు నేషనల్ యూనిటీ అవార్డ్ – రేపు ప్రధానం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ సాధిఖ్ జాతీయ ఐక్యత పురస్కారాన్ని అందుకోనున్నారు. మైనార్టీస్ ఎంపవర్ మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జాతీయ మైనార్టీ దినోత్సవ వేడుకలతో పాటూ జాతీ నిర్మాణంలో మైనార్టీల పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన వారికి నేషనల్ యూనిటీ అవార్డులను ప్రధానం చేయనుంది. కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు ఆలం మెహదీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మొత్తం 6 మంది నేషనల్ యూనిటీ అవార్డులు అందుకోనున్నారు. వారిలో నెల్లూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ సాధిఖ్ తో పాటూ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అలీ అక్భర్ బాషా, విజయవాడ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెలగ జోషి, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ ఎండీ అనీషా బేగం, సామాజిక వేత్త అబ్ధుల్ అజీజ్, సుధా పద్మిని ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధా పద్మిని ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!