November 22, 2019

నెల్లూరులో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం

Clock Of Nellore ( Nellore ) – న్యాయ సేవల ప్రాధికార సంస్థలు అందించే సేవలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ పొందాలని నెల్లూరుజిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి పి.జే.సుధ పిలుపునిచ్చారు. నెల్లూరులోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉన్న న్యాయ ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఆమె జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని నిర్వహించారు. సంస్థ సభ్యులు, న్యాయమూర్తులు, పోలీసులు ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి పి.జే. సుధ మాట్లాడుతూ ఏ పౌరుడైనా ఆర్ధిక స్తోమత లేక, ఇతర కారణాలతో న్యాయం పొందే అవకాశం లేనప్పుడు వారికి న్యాయం అందించేందుకే న్యాయ సేవల ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని వివరించారు. న్యాయ వ్యవస్థ ఆధ్వర్యంలో కొనసాగే న్యాయ సేవా అధికార సంస్థలు లోక్ అదాలత్ ల ద్వారా అనేక కేసులను పరిష్కరించిందని గుర్తు చేశారు. ఈ సేవలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!