November 21, 2019

నాయుడుపేటలో దొంగ అరెస్ట్ – నగలు స్వాధీనం

Clock Of Nellore ( Naidupet ) – నెల్లూరుజిల్లా నాయుడుపేట పట్టణంలో రెండు ఇళ్లల్లో చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేటకు చెందిన గువ్వల సురేష్ బాబు అనే వ్యక్తి ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీనా నాయుడుపేటలోని రాజగోపాలపురంలో నివాసం ఉండే బెల్లంకొండ లక్ష్మీ అనే మహిళ నివాసంలో బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అలాగే సెప్టెంబర్ 28వ తేదీనా కడియాలి మాల్యాద్రి అనే వ్యక్తి నివాసంలో కూడా చోరీకి పాల్పడ్డాడు. ఈ రెండు చోరీలపై కేసులు నమోదు చేసిన నాయుడుపేట పోలీసులు నేరస్తుడు గువ్వల సురేష్ బాబును బుధవారం అరెస్ట్ చేసి చోరీ చేసిన 85వేలు విలువచేసే 5 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా నాయుడుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ముద్దాయి సురేష్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!