November 21, 2019

10 లక్షల గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్ – ఇప్పటికే ఓ మహిళ జైలుకు

Clock Of Nellore ( Naidupet ) – ఈనెల 10వ తేదీనా నెల్లూరుజిల్లా, నాయుడుపేటలో 10 లక్షల విలువైన 95 కేజీల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు రాధ అనే మహిళ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు దొరికిపోగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలు పంపారు. ఇదే కేసులో మరో ముగ్గురు ఘటనా స్థలం నుండి తప్పించుకున్నారు. ఎట్టకేలకు వారిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో అందరూ చిత్తూరు జిల్లా వాసులే. తాజాగా పట్టుబడ్డ ముగ్గురిలో మేల్పడి రమేష్, ఎస్. ముంతాజ్ అలియాస్ లక్ష్మీదేవి, కావలి రాజేంద్ర ముగ్గురిని నాయుడుపేట పోలీసులు అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో సిఐ వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సై వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!