January 23, 2020

జబర్ధస్త్ నుండి తప్పుకుంటున్నా… ఇవాళే చివరి ఎపిసోడ్… వెల్లడించిన నాగబాబు

Clock Of Nellore ( Hydarabad ) – బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈటీవి జబర్ధస్త్ కామెడీ షో కష్టాల్లో పడింది. ప్రారంభం నుండి ఈ కామెడీ షోను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు నాగబాబు జబర్ధస్త్ నుండి బయటకు వెళ్లిపోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ టీవిలో ఇవాళ ప్రసారమయ్యే షోనే తన చివరి షో అని పేర్కొన్నారు. ఈ టివీలో 2013 సంవత్సరంలో నాగబాబు, రోజా జడ్జీలుగా ప్రారంభమైన జబర్ధస్త్ కామెడీ షో బుల్లి తెరపై నంబర్ వన్ షో స్థాయికి చేరుకుంది. ఈ షో ద్వారా పరిచయం అయిన అనేక మంది వెండి తెరపై నటులుగా స్థిరపడ్డారు. నెల్లూరుజిల్లాకు చెందిన మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల క్రియేషన్ సంస్థ ఈ షో నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న అనేక అంతర్గత వ్యవహార నేపద్యంలో నాగబాబు ఈ షో నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నాగబాబు స్పందిస్తూ ఏడేళ్ల పాటూ ఈ షోకు జడ్జికి కొనసాగేందుకు అవకాశం కల్పించిన శ్యాం ప్రసాద్ రెడ్డి, ఈ టీవి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జబర్ధస్త్ తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ శుక్రవారం ప్రసారమయ్యే షో తన చివరి షో అని చెప్పారు. మరో వైపు నాగబాబుతో పాటూ యాంకర్ అనసూయ కూడా ఈ షో నుండి తప్పుకున్నారు. పలువురు టీం లీడర్లు కూడా నాగబాబుతో పాటూ తప్పుకున్నట్లు తెలిసింది. వీరంతా జీ టీవితో అదే తరహా షోకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఇటీవల జీ టీవిలో ప్రసారమైన ఓ ప్రొమోను చూస్తే అర్ధమవుతుంది. రోజా మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. నాగబాబు స్థానంలో ఎవరొస్తారనేది ఇంకా తెలియలేదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!