November 22, 2019

” నారా హమారా “… కేసులను తొలగించండి… ప్రభుత్వాన్ని కోరిన ముస్లిం నేతలు

Clock Of Nellore ( Gudur ) – గత ప్రభుత్వ హయాంలో జరిగిన నారా హమారా కార్యక్రమంలో ముస్లింలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని ప్లకార్డులతో నిరసన తెలిపిన నంద్యాల యువకులపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి నెల్లూరుజిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. ఆ కేసులను తొలగిస్తున్నట్లు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ దానికి సంభందించిన జీఓ విడుదల చేయలేదని గుర్తు చేశారు. ఆదివారం గూడూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసుల తొలగింపుకు జీఓ విడుదల చేయకపోవడంతో అక్రమ కేసులకు గురైన వారు కోర్టుల చుట్టూ తిరగలేక మానసిక వేదనకు గురౌతున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం జీఓను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గుంటూరులో జరిగిన ఓ సంఘటన విషయంలో కూడా కేసును తొలగిస్తానని ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని అది కూడా ఇప్పటి వరకూ నెరవేర్చలేదన్నారు. ఈ కేసుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారని వారి భవిష్యత్తును దృష్ఠిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్వర్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సయ్యద్ అల్తాఫ్, షేక్ షఫీ, ఉస్మాన్, గౌస్ బాషా, రెహమాన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!