November 16, 2019

బీసి మహాసభను జయప్రదం చేయండి – పిలుపునిచ్చిన ఆర్కాట్ శ్రీనివాసులు

Clock Of Nellore ( Nellore ) – ఆదివారం నెల్లూరులో జరిగే బీసి మహాసభను బీసీ కులస్తులంతా విజయవంతం చేయాలని బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు సింహపురి మొదలియార్ సంక్షేం సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్కాట్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం ఆయన క్లాక్ ఆఫ్ నెల్లూరు పత్రిక ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో బీసి మహా సభ జరుగుతుందని చెప్పారు. బీసి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్. కృష్ణయ్య, జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాము ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు జిల్లాలోని మొదలియార్ కులస్తులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలు, వారి పరిష్కారాలపై ఈ సభలో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులతో పాటూ వివిధ జిల్లాలకు చెందిన నేతలు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!