January 23, 2020

వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే ఆనం వెల్లడి

Clock Of Nellore ( Venkatagiri ) – వెంకటగిరి మున్సిపాలిటీలోని అన్నీ ప్రాంతాల్లో ప్రణాళికా బద్దంగా మౌలిక వసతులు కల్పిస్తామని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా రాజ కుటుంబీకులు సర్వజ్ఞ కుమార యాచేంద్ర, స్థానిక వైసీపి నేతలు మరియు అధికారులతో కలిసి గ్రామదేవత పోలేరమ్మను దర్శించుకున్నారు. అనంతరం పాత కూరగాయల మార్కెట్, ఇరిగేషన్ చెరువులను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. రానున్న అమ్మవారి జాతరను దృష్ఠిలో ఉంచుకుని అసంపూర్తిగా ఉన్న బొమ్మిడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాత కూరగాయల మార్కెట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పునర్ నిర్మించాలని చెప్పారు. పట్టణ ప్రజలకు నిరంతరం తాగునీరు అందేలా 2వ సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అన్నీ వసతులు కల్పించి, మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. పట్టణాన్ని ఎలా అభివృద్ది చేయాలనే దానిపై తనకు పూర్తి అవగాహన ఉందని రానున్న రోజుల్లో వెంకటగిరి మున్సిపాల్టీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అవినీతి రహిత అభివృద్దిని సాధించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!