November 12, 2019

నెల్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – రైతు భరోసా సభ ఏర్పాట్ల పరిశీలన

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నెల్లూరుకు విచ్చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరుకు వచ్చిన ఆయన కార్యక్రమం అనంతరం విక్రమ సింహపురి యూనివర్శిటీ ప్రాంగణంలో జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆయన సభా వేదికను పరిశీలించారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే రైతు భరోసా సభను విజయవంతంగా చేయాలని జిల్లా నేతలకు సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!