November 16, 2019

నెల్లూరు 43వ డివిజన్ లో మంత్రి అనీల్ పర్యటన – షాదీమంజిల్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ సోమవారం నెల్లూరులోని 43వ డివిజన్ లో పర్యటించారు. కోటమిట్ట, ఆల్తాలిం మసీదు వీధి, పిఎన్ఎమ్ స్కూల్ వీధి, జెండా వీధి తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే వాటిని పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అలాగే కోటమిట్టలో నిర్మాణంలో ఉన్న షాదీ మంజిల్ భవనాన్ని పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపి నేతలు ఖలీల్ అహ్మద్, మీరా మొహిద్ధీన్, మున్వర్, ఇంతియాజ్, వేలూరు మహేష్, నూనె మల్లిఖార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!