November 19, 2019

ప్రభుత్వ పేరు ప్రతిష్ఠలు పెంచండి – సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు అందజేసిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సకాలంలో సేవలందించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచిపేరు తీసుకురావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ కోరారు. నెల్లూరు నగరపాలక సంస్థలో వార్డు సచివాలయ ఉద్యోగులుగా నియమితులైన అభ్యర్ధులకు ఆయన శనివారం నియామక పత్రాలను అందజేశారు. కమీషనర్ పివివిఎస్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపి యువజన విభాగం అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరు అభ్యర్ధులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే లక్షా 74వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలనే ఉద్దేశ్యంతో సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సచివాలయాలకు ఎంపికైన ఉద్యోగులు నిజాయితీగా పనిచేసి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఉద్యోగ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!