November 19, 2019

ఈనెల 28నుండి మూలాపేట శివాలయంలో కార్తీక మాసోత్సవాలు – ఏర్పాట్లపై మంత్రి అనీల్ సమీక్ష

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మూలపేటలోనున్న భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 28వ తేదీ నుండి నవంబర్ 26వ తేదీ వరకూ కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంభందించి ఆలయంలో ఏర్పాట్లపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ గురువారం ఆలయంలో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. కార్తీక మాసంలో శివుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, ఆలయానికి మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తారని వారి భద్రత కోసం మహిళా పోలీసులను ఎక్కువ మందిని అందుబాటులో ఉంచారని సూచించారు. పారిశుధ్య సమస్యలు ఉండకూడదన్నారు. విఐపిల దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయించి, సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, నగర డిఎస్పీ శ్రీనివాసులురెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ మల్లిఖార్జున రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రమణారెడ్డి, ఆలయ ఈఓ వేణు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!