November 16, 2019

ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం – మంత్రి అనీల్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఉన్న అన్నీ ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. నెల్లూరులోని 13వ డివిజన్ పరిధిలో ఉన్న ఎలమవారి దిన్నె ప్రాంతాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వీధి వీధి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. పెండింగ్ పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి అనీల్ మాట్లాడుతూ ఎలమవారిదిన్నె ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న డ్రైన్ పనులను పూర్తి చేస్తామన్నారు. అలాగే స్మశానానికి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుందని స్థానికులు చెప్పారని త్వరలోనే ఈ ప్రాంతంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయించి ఆ సమస్యను తీరుస్తామన్నారు. నెల్లూరులో ఉన్న అన్నీ ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Nice try write your own content !!